రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు చేయబోతుందని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ కచ్చితంగా గ్లోబల్ సిటీ అని చెప్పిన ఆయన.. ఎవరు ఊహించని విధంగా పెట్టుబడులు తీసుకువచ్చి, అభివృద్ధి చేస్తామన్నారు. మూసీని గ్లోబల్ లెవల్ లో డెవలప్ చేయబోతున్నామని వెల్లడించారు. మెట్రో రైల్ ఫెసిలిటీని అన్ని వైపులా విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు.
తెలంగాణను, హైద్రాబాద్ అభివృద్ధిలో నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు మంత్రి ఉత్తమ్. తాము తీసుకునే నిర్ణయాలు కన్ స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగాలను అభివృద్ధి చేసేలా ఉంటాయన్నారు. తమది కుటంబ పాలన కాదన్న మంత్రి .. డెమొక్రటిక్ ప్రభుత్వమని చెప్పారు. హైదరాబాద్ ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నామని తెలిపారు. రాబోయ్ తరాలకు సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ను అందించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.