తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రాబోయే నాలుగున్నరేళ్లలో తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మూడు -నాలుగేళ్లలో మూసీ నదిని సుందరీకరిస్తామని చెప్పుకొచ్చారు.   వచ్చే మూడేళ్లలో విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని స్పష్టం చేశారు.  నల్లగొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పంప్ హౌస్, ప్రాజెక్టు రిజర్వాయర్ లను మంత్రి కోమటిరెడ్డి పరిశీలించారు.  

ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రగతి భవన్, ఫామ్ హౌస్ కే  పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ చదువు గురించి ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి్ందని  .. పాఠశాలల నుండి విశ్వవిద్యాలయం వరకు విద్యావ్యవస్థను పటిష్ట పరచడమే ప్రభుత్వం ముందున్న ధ్యేయమని చెప్పుకొచ్చారు.   తెలంగాణ ఏర్పడి పదేళ్లైనా అసలైన రాష్ట్రం డిసెంబర్ 3 న వచ్చిందని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి.