జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి

కామారెడ్డి, వెలుగు: జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చి దిద్దుతామని స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు.  ఆదివారం జాతీయ సమైఖ్యత దినోత్సవం సందర్భంగా  కామారెడ్డి కలెక్టరేట్లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇప్పుడు అన్ని రంగాల్లో దేశంలోనే  నంబర్​ వన్​ స్థానంలో రాష్ట్రం ఉందన్నారు.  జిల్లాలో  మెడికల్​ కాలేజీ ప్రారంభించామని, త్వరలో  నర్సింగ్ కాలేజీ కూడా శాంక్షన్​ అవుతుందని తెలిపారు.    ఉద్యోగుల సహాకారం వల్లే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్​ దఫేదర్​శోభ,   ఎంపీ బీబీపాటిల్​, ఎమ్మెల్యేలు  హన్మంతుషిండే, జాజాల సురేందర్​, కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​,  ఎస్పీ శ్రీనివాస్​రెడ్డి, అడిషనల్​ కలెక్టర్లు  మను చౌదరి,  చంద్రమోహన్​ పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమైక్యత వేడుకలు

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆఫీసుల్లో సమైక్యత వేడుకలు ఘనంగా జరిగాయి.  నిజామాబాద్​ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన జీపీ సిబ్బందికి అవార్డులు పంపిణీ చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ జాతీయ జెండాను ఎగరవేశారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో డీసీపీ (లా అండ్ ఆర్డర్) జయరాం జాతీయ జెండాను ఎగరవేశారు. 

Also Rard :- మన పండుగలకు లోకల్ వస్తువులే కొందాం..వోకల్ ఫర్ లోకల్

డీఐజీ క్యాంపు కార్యాలయంలో మేనేజర్ రాజా ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు. కామారెడ్డి జిల్లా పోలీస్​ఆఫీసులో ఎస్పీ జాతీయ జెండాని ఎగురవేశారు.  భిక్కనూరు మండలంలో ఎంపీపీ గాల్​రెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, సీఐ తిరుపతయ్య వారి కార్యాలయాల్లో జెండాలు ఎగురవేశారు. బోధన్​, ఆర్మూర్,  సాలూర మండలాల్లో కూడా పలువురు నేతలు జాతీయ జెండాలు ఎగురవేశారు.