వరంగల్‎ను హైదరాబాద్‎ మాదిరిగా తీర్చిదిద్దుతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వరంగల్‎ను హైదరాబాద్‎ మాదిరిగా తీర్చిదిద్దుతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వరంగల్:  హైదరాబాద్‎కు ఏ మాత్రం తగ్గకుండా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇందిర్మ రాజ్యం రావాలి. మార్పు చెందాల్సిన అవసరం ఉందని నమ్మిన మొదటి అడ్డా ఈ వరంగల్ గడ్డ.. రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్‎ను చేసిన గడ్డ ఇది. మొదటి బడ్జెట్‎లోనే అత్యధికంగా 72 వేల కోట్ల రూపాయలను బడ్జెట్‎లో వ్యవసాయానికి పెట్టడమే కాకుండా.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత ఈ ప్రభుత్వానిది.  గత ప్రభుత్వం వరంగల్‎లో అనేక కార్యక్రమాలు చేపడుతామని చెప్పి వాటిని పూర్తి చేయకుండా మాటలకే పరిమితం చేసింది. 

2014 లో కాళోజీ ఆడిటోరియాన్ని కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కానీ పూర్తి చేయలేదు. వాళ్లు నివసించేందుకు బిల్డింగు కట్టుకునేందుకు డబ్బులు ఖర్చు పెట్టారు.. కమీషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టిండ్రు.. కానీ కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయలేదు.’ అని పొంగులేటి అన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ఇందిరాగాంధీ జయంతి రోజున ఇద్దరు మహిళా మంత్రులు, అధికారులంతా మంత్రులే ఉన్న వరంగల్‎లో మహిళా సదస్సు పెట్టడం సంతోషించదగిన విషయం..’ అని అన్నారు.