
రాజ్ తరుణ్, రాశి సింగ్ జంటగా రామ్ కడుముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘పాంచ్ మినార్’. గోవింద రాజు సమర్పణలో మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా సాగిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘టైటిల్ బాగుంది.
టీజర్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది. డెఫినెట్‌గా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకం ఉంది’ అని చెప్పాడు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ ‘మా డైరెక్టర్ విజన్, ప్రొడ్యూసర్ ప్యాషన్‌తో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాం’ అని చెప్పాడు. ఇందులో తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని హీరోయిన్ రాశి సింగ్ చెప్పింది.
డైరెక్టర్ రామ్ కడుముల మాట్లాడుతూ ‘ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది. రాజ్ తరుణ్‌కు మంచి కం బ్యాక్ ఫిల్మ్ అవుతుంది’ అని అన్నాడు. అందరినీ కడుపుబ్బ నవ్వించాలని ఈ సినిమా చేశామని నిర్మాతలు అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాతలు ఎస్‌కేఎన్, ధీరజ్ మొగిలినేని సినిమా సక్సెస్ సాధించాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. నటులు బ్రహ్మాజీ, అజయ్ ఘోష్, లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ పాల్గొన్నారు.