ఏడుకొండలపై రాజకీయం మాట్లాడితే రంగు పడుద్ది : టీటీడీ చైర్మన్ వార్నింగ్

ఏడుకొండలపై రాజకీయం మాట్లాడితే రంగు పడుద్ది : టీటీడీ చైర్మన్ వార్నింగ్

తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని TTD ఛైర్మన్ BR నాయుడు హెచ్చరించారు. ‘తిరుమల రాజకీయ వేదిక కాదు. తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అతనిపై చర్యలకు ఆదేశించారు.  తిరుమల పవిత్ర క్షేత్రమని.. కొండపై ఎవరు రాజకీయాలు మాట్లాడినా చర్యలు తీసుకుంటామని గతంలోనే హెచ్చరించామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు.

తిరుమల పవిత్రతను కాపాడే  విషయంలో వెనుకడుగు వేయకూడదనే మా  పాలకమండలి తొలి సమావేశంలోనే ప్రత్యేక ఎజెండాగా ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నామని  తెలిపారు. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు ఎంతటివారైనా సరే ఉపేక్షించేదేలేదని..  తెలంగాణకు చెందిన రాజకీయ నేత శ్రీనివాసగౌడుపై టీటీడీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన  తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని  తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ....  అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నామని  టీటీడీ ఛైర్మన్ బి.ఆర్‌.నాయుడు తెలిపారు.