సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్ సభలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణపై పెద్దపల్లి ఎంపీ వంశీ లోక్ సభలో ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నలకు బదులిచ్చారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ..  దేశంలో ఏ బొగ్గుగని కూడా  ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేదని చెప్పారు.

 ప్రైవేటీకరణ చేయాలంటే 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర నిర్ణయమే కీలకమన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ అంశం కేవలం రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లోనే ఉంటుందని వెల్లడించారు. ఒడిశా ప్రభుత్వంతో చర్చించి సింగరేణికి ఒక గనిని కేటాయించామని తెలిపారు. సింగరేణికి కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఉంటుందన్నారు.