బోనాల పండగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. 2024 జులై 7వ తేదీ నుండి జరిగే బోనాల పండుగ ఏర్పాట్లను మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ బోనాల పండుగ ఏర్పాట్లపై అన్ని శాఖల సమన్వయముతో ముందుకు వెళ్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెంపుల్స్ వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
గత ప్రభుత్వంలో లాగా అరకొర సౌకర్యాలతో కాకుండా ఈ ఏడాది మరింత వైభవంగా బోనాల పండుగను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. రూ. 25 కోట్లు ఫండ్స్ రిలీజ్ చేయించేలా సీఎం రేవంత్ తో తాను మాట్లాడుతానని అన్నారు. ఆర్టీసీ కుడా స్పెషల్ బస్సులు నడపాలని ఆదేశాలు జారీ చేస్తామన్నారు. త్వరలోనే బోనాల డేట్స్ , పూర్తి సమాచారంతో కాలెండర్ ను రిలీజ్ చేస్తామన్నారు.