రెవెన్యూ శాఖ పునరుద్ధరణలో భాగమవుతాం

  • కొత్త ఆర్వోఆర్ చట్టం అమలుకు శక్తివంచన లేకుండా పని చేస్తాం
  • ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ప్రకటన 
  • రెవెన్యూ సర్వీసెస్ అసోసియేష‌‌‌‌న్ కార్యవ‌‌‌‌ర్గం ఎన్నిక‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చిన్నాభిన్నమైన రెవెన్యూ వ్యవ‌‌‌‌స్థను పున‌‌‌‌రుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రయ‌‌‌‌త్నించ‌‌‌‌డం సంతోష‌‌‌‌క‌‌‌‌ర‌‌‌‌మ‌‌‌‌ని, ఈ ప్రయ‌‌‌‌త్నంలో రెవెన్యూ ఉద్యోగులంతా భాగ‌‌‌‌స్వాములం అవుతామ‌‌‌‌ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.ల‌‌‌‌చ్చిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ల‌‌‌‌క్డీక‌‌‌‌పూల్‌‌‌‌లోని అశోక హోట‌‌‌‌ల్‌‌‌‌లో తెలంగాణ రెవెన్యూ స‌‌‌‌ర్వీసెస్ అసోసియేష‌‌‌‌న్‌‌‌‌(టీజీఆర్ఎస్ఏ) రాష్ట్ర స్థాయి స‌‌‌‌మావేశం జ‌‌‌‌రిగింది. ఈ స‌‌‌‌మావేశంలో టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర నూత‌‌‌‌న క‌‌‌‌మిటీని ఏక‌‌‌‌గ్రీవంగా ఎన్నుకున్నారు. 

అధ్యక్షుడిగా బాణాల రాంరెడ్డి, ప్రధాన కార్యద‌‌‌‌ర్శిగా బిక్షం, కోశాధికారిగా మ‌‌‌‌ల్లేశ్‌‌‌‌, మ‌‌‌‌హిళా విభాగం అధ్యక్షురాలిగా సుజాత చౌహాన్ ఎన్నిక‌‌‌‌య్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వి.ల‌‌‌‌చ్చిరెడ్డి హాజ‌‌‌‌రై ప్రసంగించారు. గ‌‌‌‌త ప్రభుత్వం గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవ‌‌‌‌స్థను ఎత్తేయ‌‌‌‌డం వ‌‌‌‌ల్ల మొత్తం రెవెన్యూ వ్యవ‌‌‌‌స్థ నిర్వీర్యం అయ్యింద‌‌‌‌న్నారు. మ‌‌‌‌ళ్లీ వీఆర్ఏ, వీఆర్వో వ్యవ‌‌‌‌స్థను పున‌‌‌‌రుద్ధరించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయ‌‌‌‌త్నిస్తుండటాన్ని స్వాగతించారు. 

గ్రామానికో రెవెన్యూ అధికారిని ఏర్పాటు చేయాల‌‌‌‌ని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవ‌‌‌‌డం మంచి ప‌‌‌‌రిణామ‌‌‌‌మ‌‌‌‌ని చెప్పారు. కొత్త ఆర్వోఆర్ చట్టం అమ‌‌‌‌లు కోసం శ‌‌‌‌క్తివంచ‌‌‌‌న లేకుండా ప‌‌‌‌ని చేస్తామ‌‌‌‌న్నారు. తెలంగాణ ఉద్యమ స‌‌‌‌మ‌‌‌‌యంలో రెవెన్యూ ఉద్యోగుల‌‌‌‌ను భాగం చేయాల‌‌‌‌నే ల‌‌‌‌క్ష్యంతో తెలంగాణ రెవెన్యూ స‌‌‌‌ర్వీసెస్ అసోసియేష‌‌‌‌న్‌‌‌‌(టీజీఆర్ఎస్ఏ)ను ఏర్పాటు చేశామ‌‌‌‌ని ల‌‌‌‌చ్చిరెడ్డి తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల‌‌‌‌ను ఐక్యం చేసి, స‌‌‌‌మ‌‌‌‌స్యల ప‌‌‌‌రిష్కారానికి కృషి చేసే వేదిక‌‌‌‌గా టీజీఆర్ఎస్ఏ ప‌‌‌‌ని చేస్తుంద‌‌‌‌న్నారు. సంఘం నూత‌‌‌‌న కార్యవ‌‌‌‌ర్గానికి ఆయ‌‌‌‌న శుభాకాంక్షలు తెలిపారు. 

స‌‌‌‌మ‌‌‌‌స్యల ప‌‌‌‌రిష్కారానికి కృషి: బాణాల రాంరెడ్డి 

గ‌‌‌‌తంలో విధ్వంస‌‌‌‌మైన రెవెన్యూ వ్యవ‌‌‌‌స్థను తిరిగి గాడిలో పెట్టేందుకు చ‌‌‌‌ర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి టీజీఆర్ఎస్ఏ అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రెవెన్యూ శాఖ‌‌‌‌లో క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సంఖ్య త‌‌‌‌గ్గి, ప‌‌‌‌నిభారం విప‌‌‌‌రీతంగా పెరిగిపోయింద‌‌‌‌న్నారు.

గ్రామ‌‌‌‌, మండ‌‌‌‌ల‌‌‌‌, డివిజ‌‌‌‌న్ స్థాయిలో ప‌‌‌‌రిష్కరించాల్సిన రెవెన్యూ స‌‌‌‌మ‌‌‌‌స్యల‌‌‌‌ను గ‌‌‌‌త ప్రభుత్వం రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లింద‌‌‌‌న్నారు. కార్యక్రమంలో డిప్యూటీ క‌‌‌‌లెక్టర్స్ అసోసియేష‌‌‌‌న్ ప్రధాన కార్యద‌‌‌‌ర్శి కె.రామ‌‌‌‌కృష్ణ, టీజీటీఏ అధ్యక్షుడు ఎస్‌‌‌‌.రాములు, ప్రధాన కార్యద‌‌‌‌ర్శి ర‌‌‌‌మేశ్ పాక‌‌‌‌, సెక్రట‌‌‌‌రీ జ‌‌‌‌న‌‌‌‌ర‌‌‌‌ల్ ఫూల్ సింగ్ చౌహాన్‌‌‌‌, మహిళా అధ్యక్షురాలు రాధ‌‌‌‌, కోశాధికారి శ్రీనివాస్ శంక‌‌‌‌ర్‌‌‌‌రావు త‌‌‌‌దిత‌‌‌‌రులు పాల్గొన్నారు.