హైదరాబాద్ పికిల్ బాల్‌‌‌‌ అసోసియేషన్ ప్రెసిడెంట్‌‌‌‌ దుద్దిళ్ల శ్రీనివాస్ బాబు

 హైదరాబాద్ పికిల్ బాల్‌‌‌‌ అసోసియేషన్ ప్రెసిడెంట్‌‌‌‌ దుద్దిళ్ల శ్రీనివాస్ బాబు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతూ.. ఇండియాలో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న  పికిల్ బాల్ గేమ్‌‌‌‌ను రాష్ట్రంలో ప్రోత్సహిస్తామని  హైదరాబాద్ పికిల్ బాల్ అసోసియేషన్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ దుద్దిళ్ల శ్రీనివాస్ బాబు అన్నారు. ఈ ఆటలో ప్రతిభావంతులను గుర్తించి వాళ్లు అంతర్జాతీయ  స్థాయిలో  రాణించేలా కృషి చేస్తామని చెప్పారు.  సోమవారం హైదరాబాద్‌‌‌‌ కొండాపూర్‌‌‌‌‌‌‌‌లో పాడిల్ వెవ్ సంస్థ ఏర్పాటు చేసిన పికిల్ బాల్ కోర్టులను ఆయన ప్రారంభించారు. ఈ ఆటకు రాష్ట్రమంతా గుర్తింపు తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సుమిరన్, సత్యదీప్‌‌‌‌, హైదరాబాద్ పికిల్ బాల్ సంఘం సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, ట్రెజరర్ శ్రీధర్ ముదిరాజ్, జాయింట్ సెక్రటరీ అజయ్ కందుల పాల్గొన్నారు.