మరిన్ని ఇన్​ఫ్రా ప్రాజెక్టులకు ఫండింగ్​ ఇస్తాం :  ఐఐఎఫ్​సీఎల్​ ఎండీ జైశంకర్​

మరిన్ని ఇన్​ఫ్రా ప్రాజెక్టులకు ఫండింగ్​ ఇస్తాం :  ఐఐఎఫ్​సీఎల్​ ఎండీ జైశంకర్​

హైదరాబాద్​, వెలుగు: దేశంలోని మరిన్ని ఇన్​ఫ్రా ప్రాజెక్టులకు ఫండింగ్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ విజన్​కు సపోర్ట్​గా నిలవాలనే టార్గెట్​తో పనిచేస్తున్నట్లు  ఇండియా ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఫైనాన్స్​ కంపెనీ లిమిటెడ్​ (ఐఐఎఫ్​సీఎల్​) మేనేజింగ్​ డైరెక్టర్​ పీ ఆర్​ జైశంకర్​ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని జీఎంఆర్​ హైదరాబాద్​–విజయవాడ ఎక్స్​ప్రెస్​వేస్​, హెచ్​కేఆర్​ రోడ్​వేస్​, జీఎంఆర్​ హైదరాబాద్​ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​, ఎల్​ అండ్​ టీ మెట్రో రైల్​ వంటి భారీ ప్రాజెక్టులకు ఐఐఎఫ్​సీఎల్​ రూ. 40,017 కోట్ల ఫండింగ్​ ఇచ్చిందని చెబుతూ, మరిన్ని ప్రాజెక్టులకు నిధులు అందించడానికి రెడీగా ఉన్నామని పేర్కొన్నారు.

హైదరాబాద్​లోని ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, ఫైనాన్స్​ సెక్టార్లలోని స్టేక్​హోల్డర్లతో ఐఐఎఫ్​సీఎల్​ సీనియర్​ ఆఫీసర్లు గురువారం నాడు సమావేశమయ్యారు. స్టేక్​హోల్డర్లు ఇచ్చిన సూచనలను, సలహాలను ఆధారంగా చేసుకుని భవిష్యత్​లో మరింత మెరుగైన సేవలు అందించాలనేదే లక్ష్యమని జైశంకర్​ వెల్లడించారు. ఇన్​ఫ్రాస్ట్రక్చర్​లోని అన్ని సబ్​ సెక్టార్లకు తగిన ప్రొడక్టులతో ఫండింగ్​ అందిస్తున్న సంస్థ తమది ఒక్కటేనని వివరించారు. మార్చి 2023 నాటికి ఐఐఎఫ్​సీఎల్​ శాంక్షన్లు రూ. 2,13,378 కోట్లకు, డిస్​బర్స్​మెంట్లు రూ. 1,05,647 కోట్లకు చేరాయని చెప్పారు.