ట్రాన్స్ జెండర్లకు భద్రత, రక్షణ కల్పిస్తాం

ట్రాన్స్ జెండర్లకు చట్టపరంగా భద్రత, రక్షణ కల్పించేలా చేస్తామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. రాష్ట్ర మహిళా సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ప్రైడ్ ప్లేస్ అనే ట్రాన్స్ జెండర్ ప్రొటెక్షన్ సెల్ ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ట్రాన్స్ జెండర్ల భద్రత కోసం ప్రైడ్ ప్లేస్ స్టార్ట్ చేశామన్నారు. ట్రాన్స్ జెండర్లపై వివక్ష, హింసనును అరికట్టడమే ఈ ప్రైడ్ ప్లేస్ లక్ష్యమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్ జెండర్ల కోసం ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 
ప్రొటెక్షన్ సెల్ ట్రాన్స్ జెండర్స్  వ్యక్తులకు బాగా ఉపయోగపడుతుందని, ట్రాన్స్ జెండర్లకు  హక్కులపై  అవగాహన కల్పించడం, చట్టపరంగా వారికి ఉన్న భద్రత, రక్షణ ఉండేలా చేస్తామన్నారు. రాష్ట్రంలో మహిళలకు పోలీసు శాఖ ఎంతో ప్రాధాన్యత,భద్రతా ఇస్తుందని డిజిపి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

రోప్ వే ప్రమాద రెస్క్యూ ఆపరేషన్ క్లోజ్

అక్బరుద్దీన్ కేసులో తీర్పు వాయిదా

ఒకప్పుడు సైడ్ యాక్టర్.. ఇప్పడు హ్యాట్రిక్ హీరో

మా వివరాలు ఇవ్వొద్దు..స్విస్ కోర్టులకు ఇండియన్ల రిక్వెస్ట్