బడంగ్ పేట్, వెలుగు: మహేశ్వరంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు అన్నారు. ప్రధాని మోదీ సభకు సహకరించిన రాష్ట్ర, రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని చెప్పారు. మహేశ్వరంలో అందెల శ్రీరాములు మాట్లాడుతూ.. తుక్కుగూడ వేదికగా దేశ ప్రధాని మోదీ ఇచ్చిన సందేశం స్ఫూర్తిగా మహేశ్వరంలో డిసెంబర్ 3న బీజేపీ జెండా ఎగురబోతుందన్నారు.
మోదీ సభకు చేరుకోలేక సభ బయట, రోడ్లపై ఆగిపోయినా ఆప్తులు డిసెంబర్ 3న విజయోత్సవ ర్యాలీ చేసుకుందామన్నారు. నవంబర్ 30న జరిగే పోలింగ్‌లో యువత భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ అయిదు రోజులు కష్టపడి పని చేసి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.