బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఫైర్ అయ్యారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం దోచుకున్న డబ్బులు కక్కించి, జైలుకి పంపిస్తామని అన్నారు. రానున్న బతుకమ్మ పండుగ కవిత జైల్లో ఆడవాల్సి వచ్చిందని చెప్పారు. బిడ్డ జైలు శిక్ష అనుభవిస్తున్న ఏ ముఖం పేట్టుకొని కేసీఆర్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రచారాన్ని చూసి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారం చెయ్యకుండా ఇంటి దగ్గర ఉండాలని హితవు పలికారు.
నల్లగొండ జిల్లా చిట్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మెజారిటీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలతో కాదని, నకిరేకల్ మునుగోడు ప్రజల మధ్య పోటీ అని అన్నారు. నకిరేకల్ అభివృద్ధి కోసం పంచ పాండవులగా ఎమ్మెల్యే లు, మంత్రి , ముఖ్యమంత్రి పని చేస్తామని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.