
పనులు చేయకుండా జాప్యం చేసే కాంట్రాక్టర్లను ఉపేక్షించేదిలేదని, వారిని తొలగించి బ్లాక్ లిస్టులో పెడతామని, భవిస్యత్తులో పనులు ఇవ్వమని మంత్రి సీతక్క హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న మిషన్ భగీరథ, రూరల్ రోడ్ల పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనులపై ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తే అధికారులు స్పందించి వివరణ ఇవ్వాలని సూచించారు. త్వరలోనే రోడ్లన్నీ పూర్తి చేస్తామని చెప్పారు.
అంగన్వాడీలలో మెరుగైన సౌకర్యాలు, బలోపేతం చేయడంపై చర్చించినట్లు తెలిపారు.గతంలో ఎప్పుడూ లేని విధంగా అంగన్వాడీలలో యూనిఫాం ఇస్తున్నామని అన్నారు. పిల్లలకు ఇచ్చే బాలామృతంలో మార్పులు తీసుకువస్తామని చెప్పారు. వివిద రకాల ఐటమ్స్ తో పౌష్టికాహారం అందేలాగా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.
►ALSO READ | మాకు ఆస్తుల్లేవ్.. డీవోపీటీకి తెలిపిన ఐఏఎస్, ఐపీఎస్లు.. ఇప్పటికీ వివరాలు వెల్లడించని ఆరుగురు