ప్రాచీన పుస్తకాలను పునరుద్ధరిస్తాం

ప్రాచీన పుస్తకాలను పునరుద్ధరిస్తాం
  • డిపార్ట్​మెంట్ ఆఫ్ హెరిటేజ్ డైరెక్టర్ ఐఏఎస్ డాక్టర్ లక్ష్మి

బషీర్​బాగ్, వెలుగు: వందల ఏండ్ల నాటి పుస్తకాలను సరికొత్త హెర్బల్ టెక్నాలజీ ద్వారా పునరుద్ధరించి, భవిష్యత్​తరాలకు అందించేందుకు నూర్ ఇంటర్నేషనల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు డిపార్ట్​మెంట్ ఆఫ్ హెరిటేజ్ డైరెక్టర్ ఐఏఎస్ డాక్టర్ లక్ష్మి తెలిపారు. రాష్ట్ర ఆర్కియాలజీ, మ్యూజియం శాఖ ఆధ్వర్యంలో నాంపల్లిలోని స్టేట్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. 

పర్షియాన్, ఉర్దూ భాషల్లో ఉన్న సుమారు 323 పుస్తకాలు, 1443 డాక్యుమెంట్లను ఈ సంస్థ రిస్టోర్ చేయనున్నట్లు తెలిపారు. మన తెలంగాణ సంస్కృతీ, వారసత్వ సంపదను కాపాడేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమం ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఇరాన్ రాయబార కార్యాలయానికి చెందిన నూర్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.