
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం ఎంపికకు సంబంధించి జాప్యం ఎందుకు జరుగుతోందని మాజీ సీఎం ఆతిశి బీజేపీని నిలదీశారు. ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం ఉన్న నేతలు ఎవరూ లేకపోవడం వల్లే బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించట్లేదని విమర్శించారు. “ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులైంది. ఫిబ్రవరి 9న బీజేపీ సీఎంను ప్రకటిస్తుంద ని, అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభిస్తుందని ప్రజలు భావించారు.
కానీ, ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం గల నేతలు ఆ పార్టీకి ఎవరూ లేరని ఇప్పుడు స్పష్టమవుతోంది. 48 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరిపైన కూడా ప్రధాని మోదీకి నమ్మకం లేదు. అందుకే సీఎం అభ్యర్థిని ప్రకటించడంలేదు. పాలనపై బీజేపీకి ఎటువంటి విజన్, ప్లాన్ లేదు” అని ఆతిశి ప్రశ్నించారు.