పార్టీ కోసం కష్టపడలేని ఎంతటి నేతనైనా పక్కన పెడతాం: సీఎం రేవంత్

పార్టీ కోసం కష్టపడలేని ఎంతటి నేతనైనా పక్కన పెడతాం: సీఎం రేవంత్

పార్టీ కోసం కష్టపడలేని ఎంతటి నేతనైనా పక్కన పెడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పైరవీల ద్వారా పదవులు రావని.. ప్రోగ్రెస్ చూసి పదవులు వస్తాయని అన్నారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పని ప్రోగ్రెస్ చూసే మళ్లీ పదవి రెన్యువల్ చేయడం జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యలు:

  • పార్టీలో టికెట్ రాని వాళ్లను, వచ్చిన వాళ్లను ఏకతాటిపైకి తెచ్చాం
  • జెండా మోసిన 31 మందికి ఒక్క కలం పోటుతో పదవులు ఇచ్చాం
  • అవకాశం రాని అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు.
  • కలిసి పనిచేయడం వల్లే తెలంగాణలో అధికారంలో కి వచ్చాం
  • పార్టీ కట్టుబాట్లను మీనాక్షి నటరాజన్ ను చూసి నేర్చుకోవచ్చు
  • ప్రతి కార్పోరేషన్ పదవి కష్టపడ్డ కార్యకర్తకే ఇచ్చాం
  • ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
  • జెండా మోసిన కార్యకర్తలకు సముచిత స్థానం వస్తుంది
  • పైరవీల ద్వారా ఎప్పటికీ పదవులు రావు
  • ఏఐసీసీ అనుమతితో త్వరలో మరిన్ని పదవులు ఇస్తాం