హైదరాబాద్: గ్రేటర్ లో అభివృద్ధి పనులు మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తామన్నారు మంత్రి కేటీఆర్. శుక్రవారం ఆయన..జిహెచ్ఎంసి పరిధిలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. త్వరలోనే జిహెచ్ఎంసి పరిధిలో సుమారు 85 వేల ఇళ్లు, పేద ప్రజలకు అందించేలా ముందుకుపోతున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా వేగవంతం చేయాలన్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న లేదా ప్రజలు కోరుకుంటున్న మౌలిక వసతుల కార్యక్రమాలను తన దృష్టికి తీసుకు వస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు మంత్రి కేటీఆర్. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.