ఆరోగ్యవంతమైన కరీంనగర్ జిల్లా తమ లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లోని సుడా అధ్వర్యంలో కొనుగోలు చేసిన రెండు స్వీపింగ్ మిషన్ వాహనాలను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్...పరిశుభ్రత కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో డెంగ్యూ నివారణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
నగర పరిశుభ్రత కోసం ఐదు వాహనాలు కొనుగోలు చేశామన్న గంగుల.. సుడా తరపున కొన్న వాహనాలను కరీంనగర్ రూరల్ ప్రాంతంలో వినియోగిస్తామని చెప్పారు. కరీంనగర్ ప్రజలు ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు జెడ్పీ ఛైర్ పర్సన్ కనుమల్ల విజయ, సుడా ఛైర్మన్ జీవి రామకృష్ణ రావు, మేయర్ సునీల్ రావు, కలెక్టర్ కర్ణన్ లు పాల్గొన్నారు.