స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : ప్రజల ముంగిట్లోకి న్యాయసేవలు అందించేందుకు కృషి చేస్తామని జనగామ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి రవీంద్రశర్మ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ కేంద్రానికి కొన్ని నెలల కిందట మంజూరైన ఫస్ట్ క్లాస్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును స్థానిక బస్టాండ్ సమీపంలోని తిరుమలనాథస్వామి దేవాలయం ఎదుట ఉన్న ప్రభుత్వ బిల్డింగ్‌లో ఏర్పాటు చేస్తున్నారు.
గురువారం ఈ భవనాన్ని జనగామ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్‌జడ్జి రవీంద్రశర్మ సందర్శించారు. కోర్టు ఏర్పాటు కోసం కావాల్సిన వసతులను పరిశీలించి, ఆర్డీవో డీఎస్ వెంకన్న, ఆర్అండ్బీ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్‌లో త్వరలో కోర్టును ప్రారంభిస్తామన్నారు. ఈ కోర్టు ఏర్పాటుతో స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు, జఫర్‌గఢ్, పాలకుర్తి, కొడకండ్ల మండలాల ప్రజలకు న్యాయ సేవలు అందుబాలోకి వస్తాయన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రభాకర్, సీనియర్ సూపరింటెండెంట్ఎండీ రహీమొద్దీన్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ దుస్స జనార్దన్, స్టేషన్‌ఘన్‌పూర్ బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కనకం రమేశ్, జనరల్ సెక్రటరీ పిల్లి కార్తీర్, కోశాధికారి గద్దె అనిల్, నీరటి కార్తీక్, పిట్టల కమలాకర్పాల్గొన్నారు. సీఐ ముసికె రాజు, ఎస్సై వినయ్‌కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.