మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేస్తామని.. స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు పునరుద్దరిస్తామని చెప్పారు. ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా పంటల కొనుగోళ్లు చేస్తామని తెలిపారు. సీఎం హోదాలో తొలిసారి కొడంగల్ లో పర్యటించిన సీఎం.. కోస్గిలో రూ.4,369 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేపట్టారు. .
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్.. అనంతరం మెడికల్, నర్సింగ్, డిగ్రీ, ఇంటర్ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, స్పీకర్ ప్రసాద్ కుమార్ అధికారులు పాల్గొన్నారు.