అంకితభావంతో పనిచేయండి.. అండగా ఉంటాం: మంత్రి జూపల్లి

అంకితభావంతో పనిచేయండి.. అండగా ఉంటాం: మంత్రి జూపల్లి

హైదరాబాద్: టూరిజం డిపార్ట్​మెంట్​లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్​సోర్సింగ్​ఉద్యోగుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ పర్యాటక శాఖ కాంట్రాక్ట్ మరియు అవుట్​సోర్సింగ్​యూనియాన్​నూతన క్యాలెండర్​ను ఆయన విడుదల చేశారు. ఈ మేరకు యూనియాన్​ప్రెసిడెంట్​వీఎస్​బోస్​, జనరల్​సెక్రటరీ రాజమౌళి పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.  ఉద్యోగులు అంకితభావంతో డ్యూటీ చేయాలన్నారు.  ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందన్నారు.  ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని కృషి చేస్తుందన్నారు.  టూరిజం డెవలప్ మెంట్​కోసం ప్రభుత్వం త్వరలోనే కొత్త పాలసీని తీసుకువస్తుందన్నారు. టూరిజం డెవలప్ మెంట్​ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని సూచించారు.

ALSO READ | ఆయన వెనుకుంది ఏ పార్టీయో అందరికీ తెలుసు.. వాళ్లు ఆడిస్తున్నట్టు ఆడుతుండు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్