సినీ పరిశ్రమకు సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటాం..: మంత్రి కోమటి రెడ్డి

సినీ పరిశ్రమకు సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటాం..: మంత్రి కోమటి రెడ్డి

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  జరిగింది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై.. ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణలో సినిమా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ సంకల్పం.  టీఎఫ్ సీసీకి  800 గజాల స్థలం ఇప్పించేందుకు ప్రభుత్వం తరపున ప్రయత్నం చేస్తాం. అలాగే చిత్రపురి కాలనీలో కొత్తగా కట్టబోయే ఫ్లాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ సినిమా వారికి ఫ్లాట్స్ ఇప్పిస్తాం. సినీ పరిశ్రమకు అన్ని విధాలుగా మా ప్రభుత్వం సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది’ అని అన్నారు. టీఎఫ్ సీసీ ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ గురురాజ్, సెక్రటరీ జేవీఆర్, నటి కవిత పాల్గొన్నారు.