- గద్దెల దాకా తీసుకుపోతాం.. ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కండి
- ఆర్టీసీ ఎండీ సజ్జనార్
ఏటూరునాగారం, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లను టీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ వీసీ. సజ్జనార్ గురువారం పరిశీలించారు. బస్ డే సందర్భంగా వరంగల్ నుంచి స్పెషల్బస్సులో మేడారం చేరుకున్నారు. అక్కడ ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి కల్పిస్తున్న సౌకర్యాలను, బస్సులు నడిచే రూట్లను, క్యూ లైన్లను, టెంట్ల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్యాసింజర్లను గద్దెల దగ్గరి వరకు చేరవేస్తామని, ఈ విషయాన్ని భక్తులు గమనించి ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. తర్వాత కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఇతర శాఖల ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు సజ్జనార్ అమ్మవార్ల గద్దెలను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈడీ మునిశేఖర్, వరంగల్ ఆర్ఎం విజయ భాస్కర్ ఉన్నారు.
మేడారంలో వారం రోజులకు లిక్కర్ షాపులు
- 22 షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్
- గిరిజనులే అర్హులన్న కలెక్టర్
మేడారం మహాజాతర నేపథ్యంలో జాతర పరిసర ప్రాంతాల్లో వైన్ షాపుల ఏర్పాటుకు కలెక్టర్ఎస్.కృష్ణ ఆదిత్య నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఈ నెల16 నుంచి జాతర ప్రారంభం కానుండగా13 నుంచి 19వ తేదీ వరకు లిక్కర్షాపులను నడిపించుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. షాపుల ఏర్పాటుకు స్థానిక గిరిజనులు మాత్రమే అర్హులని, ఈనెల 10 లోపు అప్లై చేసుకోవాలన్నారు. లైసెన్సులు పొందిన గిరిజనులు ఒక్కో షాపుకు రూ.63వేల చొప్పున కట్టాల్సి ఉంటుందన్నారు. ఏటూరు నాగారం ఐటీడీఏలో అప్లికేషన్ఫామ్స్తీసుకుని, పాన్ కార్డు, ఓటర్ఐడీ, రేషన్ కార్డు, ఆధార్ కార్డులతో కలిపి ఇవ్వాలన్నారు.