
రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ భ్రష్టుపట్టించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీలను సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రతి కార్యకర్త కష్టపడ్డారని తెలిపారు. పార్టీలను విడదీశి సీఎంలను జైల్లో వేశారని చెప్పారు. మోదీ అదాని మధ్య ఉన్నది అవినీతి బంధమని విమర్శించారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడతూ మోదీకి సీట్లు తక్కువ వస్తాయంటే స్టాక్ మార్కెట్లు పడిపోతాయా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని కాపాడుకున్నది బడుగు బలహీన వర్గాలే అని అన్నారు. జేడీయూ, టీడీపీ కూటమిపై రేపు తమ భేటీ మాట్లాడుతామని చెప్పారు. ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తన అభినందనలని తెలిపారు.