మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దుతాం : యూనియన్ బ్యాంక్  ఆఫీసర్లు గామి, వికాస్

మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దుతాం : యూనియన్ బ్యాంక్  ఆఫీసర్లు గామి, వికాస్

సిద్దిపేట రూరల్, వెలుగు: మహిళలను వ్యాపార వేత్తలు చేయడమే లక్ష్యమని, అందుకే ఎలాంటి తనఖాలు లేకుండా రుణాలు మంజూరు చేస్తున్నామని యూనియన్ బ్యాంక్ హైదరాబాద్ ఫీల్డ్ మేనేజర్ గామి, రీజనల్ హెడ్ వికాస్ అన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని విపంచి ఆడిటోరియంలో మెగా రుణమేళా నిర్వహించి పలువురు మహిళలకు, సంఘాలకు రుణపత్రాలను అందజేశారు.

వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా మరికొంత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. సిద్దిపేటలో రుణ సదుపాయం కోసం 65 శాఖలు ఉన్నాయని, ఎంఎస్ఎంఈ సపోర్ట్ తో రూ.50 వేల నుంచి రూ.5 కోట్ల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. పీఎంఎస్​బీవై, పీఎంజేజేవై, విశ్వకర్మ, పీఎంఈజీపీ, ముద్ర వంటి పథకాల కింద రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో లీడ్ డిస్టిక్ మేనేజర్ హరి బాబు పాల్గొన్నారు.