
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది స్థానాలు గెలిచి సీఎం కేసీఆర్ కు గిప్ట్ గా ఇస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి క్యాడర్ లేదని, కాంగ్రెస్ కు క్యాండిడేట్లు లేరని విమర్శించారు. కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకుంటున్నారంటూ హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ వ్యూహాన్ని ఎవరూ ఉహించలేదని, కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనతో విపక్షాలు అగమైపోయాయని చెప్పుకోచ్చారు.
2023 ఆగస్టు 23న సీఎం కేసీఆర్ మెదక్ టూర్ లో భాగంగా ఏర్పాట్లను మంత్రి దగ్గరుండి పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, పోలీస్ కార్యలయం, సమీకృత కలెక్టరేట్ కార్యలయాన్ని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. ఇదే వేదికపై వికలాంగులు ఆసరా పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిదంగా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీష్ రావు వెల్లడించారు.
ALSO READ : చిరుని విమర్శిస్తే ఏమవుతదో మాకు తెల్వదా? కొడాలి నాని
గ్లోబల్స్ ప్రచారంతో ప్రతిపక్షాలు గెలువాలని చూస్తున్నాయన్న హరీష్.. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రగతి శంకరవాన్ని మెదక్ నుంచి పూరిస్తారని, అభ్యర్థుల ప్రకటన తమ పార్టీ గెలుపు ధీమాకు నిదర్శనమన్నారు.
బీఆర్ఎస్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. మిషన్ కాకతీయ , మిషన్ భగీరథ,మెడికల్ కాలేజీలు,కుల వృత్తులకు ఇచ్చే రూ. లక్ష ఇచ్చే పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అయిందన్న హరీష్ రావు.. దేశ వ్యాప్తంగా రైతులు కేసీఆర్ పథకాలను కావాలని కోరుతున్నారని చెప్పారు. కే అంటే కాలువలు సీ అంటే చెరువులు ఆర్ రిజర్వాయర్ అని తెలిపారు. సీఎం కేసీఆర్ ను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.