
చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీని విమర్శించే స్థాయి పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు లేదన్నారు కాంగ్రెస్ నేత, కానీ సంఘం నాయకులు జాడి రాజేశం. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామి చేతోలో ఓడిపోయిన గోమాస మళ్ళీ ఇప్పుడు ఆయన కొడుకు వంశీ చేతిలో ఓడిపోవడం ఖాయమన్నారు. గతంలో ఓడిపోయిన కోపంతోనే కాకా కుటుంబంపై గోమాస ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాక వెంకటస్వామి,వివేక్ వెంకటస్వామి చేసిన అభివృద్ధి పనులు ప్రతి ప్రతి గ్రామానికి చేరాయని చెప్పారు జాడి రాజేశం. గోమాస ఈ ప్రాంతానికి ఏమి చేశాడు? ఒక్క నేతకాని కుటుంబానికైనా ఆర్థిక సహాయం చేశాడా అని ప్రశ్నించారు. పెద్దపల్లి అంటేనే వెంకటస్వామికి పెట్టింది పేరని చెప్పుకోచ్చారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ చేసిండొచ్చు.. ఇదేమైనా అంతర్జాతీయ కుంభకోణమా
సేవ చేయడానికే గడ్డం వంశీ కృష్ణ రాజకీయాల్లోకి వస్తున్నారని.. ప్రజల్లో ఆయనకు వస్తోన్న ఆదరణ తట్టుకోలేక ఈ కుటుంబ పాలన అంటూ గోమాస ఆరోపణలు చేస్తున్నారని ఫైరయ్యారు. గోమాస బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు. రాజకీయాల్లో పోటీ చేసి అమ్ముడుపోయే చరిత్ర గోమాత శ్రీనివాస్ ది అని విమర్శించారు. మంత్రి శ్రీధర్ బాబు, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో పని చేసి గడ్డం వంశీ కృష్ణని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పుకోచ్చారు.