
అమరావతి: అమలాపురంలో ఆందోళనలు జరగకుండా అదనపు బలగాలను మొహరించామని, ప్రస్తుతం అమలాపురంలో పరిస్థితి అదుపులోనే ఉందని ఏపీ హోంమంత్రి తానేటి వనిత వెల్లడించారు. హింసకు పాల్పడిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. విధ్వంసానికి కారణమైన వారిని, మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి చేసిన 72 మంది ఆందోళన కారులను గుర్తించి.. ఇప్పటి వరకు 46 మందిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.
అల్లర్లకు పాల్పడిన వారు ఎవరైనా.. ఏ ఒక్కర్నీ వదిలిపెట్టేదిలేదని ఆమె హెచ్చరించారు. సోషల్ మీడియా ద్వారా రూమర్స్ వెళ్లకుండా అమలాపురంలో ఇంటర్నెట్ నిలిపివేశామన్నారు తానేటి వనిత. ఆందోళనకారులు దాడి చేస్తున్నా.. వారు మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని పోలీసులు సంయమనం పాటించారని ఆమె పోలీసులను అభినందించారు.
ఇవి కూడా చదవండి
అంబేద్కర్ పేరు ముందే పెడితే సమస్య ఉండేదే కాదు