నిందితుడిని వదిలిపెట్టం : మంత్రి శ్రీధర్ బాబు

నిందితుడిని వదిలిపెట్టం : మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి జిల్లాలో జరిగిన మైనర్ బాలిక రేప్ కేసు బాధిత కుటుంబాన్ని తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు పరామార్శించారు. ప్రభుత్వం నిందితుడికి శిక్ష పడేలా చూస్తుందని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడారు. ఘటనపై ఆరా తీశారు.  సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇష్యూపై సీరియస్ గా ఉన్నారని చెప్పారు. 

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపడం దారుణమన్నారు. హత్యాచార ఘటన తనను కలిచివేసిందని తెలిపారు.   నిందితుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.  మంత్రి సీతక్క మాట్లాడుతూ. తమ ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై సీరియస్ గా ఉన్నారని విచారణ వేగం చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చూసుకుంటుందన్నారు.