
హుస్నాబాద్, వెలుగు: దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టిన ప్రధాని నరేంద్రమోదీని గద్దె దించాలని కాంగ్రెస్, జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఢిల్లీలో రైతులు చేపట్టిన దీక్షలకు సంఘీభావంగా సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మల్లెచెట్టు చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. ఈ నిరసనలో జేఏసీ కోఆర్డినేటర్ వీరన్న, కో కన్వీనర్ సంపత్, కొమురయ్య, మల్లేశం, చందు, రవీందర్ పాల్గొన్నారు.