విదేశాల ​వైపు సంపన్నుల పరుగు

  • 2019లోనే 7 వేల మంది జంప్​
  • ఇన్వెస్ట్​మెంట్లతో వీసా సంపాదిస్తున్నరు

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్​ ట్రావెల్​ ప్లాన్స్​కు కరోనా ఫుల్​స్టాప్​ పెట్టిన మాట నిజమే. కానీ, చాలా మంది హై నెట్–​వర్త్​ ఇండివిడ్యువల్స్​ (హెచ్​ఎన్​ఐ) మాత్రం బిజినెస్​  బేస్​ల ఏర్పాటుకోసం ఫారిన్​ కంట్రీలను వెతుక్కోవడాన్ని ఆపలేదు. ఆయా దేశాలలో లాంగ్​–టర్మ్​ రెసిడెంట్స్​గా లేదా సిటిజెన్స్​గా మారాలని మన హెచ్​ఎన్​ఐలు ప్రయత్నిస్తున్నారు. ‘రెసిడెన్స్​ బై ఇన్వెస్ట్​మెంట్’​ లేదా ‘సిటిజెన్​షిప్​ బై ఇన్వెస్ట్​మెంట్’​ ప్రోగ్రామ్స్​ కోసం 2020లో అప్లయ్​ చేసుకున్న లిస్టులో ఇండియా హెచ్​ఎన్​ఐలే ఎక్కువ మంది ఉన్నారు! 2019తో పోలిస్తే ఈ ఎంక్వైరీలు బాగా పెరిగాయని ఫెసిలిటేటింగ్​ ఏజన్సీ ఒకటి చెప్పింది. డ్యూయల్​ సిటిజెన్​షిప్​ను ఇండియా అనుమతించకపోవడంతో, సిటిజెన్​షిప్​ బై ఇన్వెస్ట్​మెంట్ ఆప్షన్​ తీసుకోవడమంటే ఇండియా పాస్​పోర్టును వదులుకోవడమే అవుతుంది. కోవిడ్​, పొలిటికల్​ సిట్యుయేషన్స్​ కారణంగా 2019లో ఆరో ప్లేస్​లో ఉన్న యూఎస్ ఈ జాబితాలో ​ 2020లో రెండో ప్లేస్​కు చేరింది.

వేలాది మంది వెళ్లిపోయారు​..

విదేశాలలో బేస్​ కోసం ఎంక్వైరీలు చేసిన లిస్టులో ఇండియా, అమెరికా తర్వాత ప్లేస్​లలో పాకిస్తాన్, సౌత్​ ఆఫ్రికా, నైజీరియాలు ఉన్నాయి. రెసిడెన్స్​, సిటిజెన్​షిప్​ ప్లానింగ్​ రంగంలోని హెన్లీ అండ్​ పార్ట్​నర్స్​ ఈ వివరాలు వెల్లడించింది. ఫారిన్​ కంట్రీస్​కు వెళ్తున్న మిలినియర్ల విషయంలో ఇండియా రెండో ప్లేస్ లో ఉందని ‘గ్లోబల్​ వెల్త్​ మైగ్రేషన్​ రివ్యూ’ పేరిట న్యూ వరల్డ్​ వెల్త్​ విడుదల చేసిన రిపోర్టు పేర్కొంది. 2019లో ఏడు వేల మంది మంది ఇండియా హెచ్​ఎన్​ఐలు ఇతర దేశాలకు వెళ్లినట్లు తెలిపింది. మొత్తం హెచ్​ఎన్​ఐలలో వీరు 2 శాతం. ఫారిన్​ దేశాలకు వెళ్లాలనే ఆసక్తి ఇండియాలోని మిలినియర్లలో తగ్గడం లేదని దీనిని బట్టి తెలుస్తోంది. 2019తో పోలిస్తే 2020లో ఎంక్వయిరీలు ఏకంగా 62.6 శాతం పెరిగాయి. 2019లో 1500 ఎంక్వయిరీలు వచ్చాయని హెన్లీ అండ్​ పార్ట్​నర్స్ సీనియర్​ ఎగ్జిక్యూటివ్ ​నిర్భయ్​ హండా  అన్నారు. కెనడా రెసిడెన్సీ, పోర్చుగల్​ రెసిడెన్సీ, ఆస్ట్రియా రెసిడెన్సీ, ఆస్ట్రియా సిటిజెన్​షిప్​ ప్రోగ్రామ్​, మాల్టా సిటిజెన్​షిప్​, టర్కీ సిటిజెన్​షిప్​ ప్రోగ్రామ్​ల కోసం ఎక్కువ మంది ఇండియన్స్​ మొగ్గు చూపుతున్నట్లు హెన్లీ అండ్​ పార్ట్​నర్స్​ పేర్కొంది. హిస్టారికల్​గా చూస్తే యూఎస్​, కెనడా, యూకే, ఆస్ట్రేలియా దేశాలు ఇండియన్స్​కు ఫేవరెట్లు. విదేశీయులను ఆకట్టుకునే ప్రోగ్రామ్స్​ విషయంలో కెనడా, ఆస్ట్రేలియా దేశాలు పోటీ పడుతున్నాయి. కాకపోతే, ఈ దేశాలలో ప్రాసెసింగ్​ టైమ్​ ఎక్కువైంది. దానికి తోడు, గతంలో కంటే ఇన్వెస్ట్​మెంట్స్​ సైజ్​ కూడా పెరిగిందని, ఫలితంగా ఇక్కడి హెచ్​ఎన్​ఐలు తమ చాయిస్​లను అనుగుణంగా మార్చుకుంటున్నారని నిర్భయ్​ హందా చెప్పారు.

ఇన్వెస్ట్​మెంట్​ వైపే మొగ్గు

ఇండియాలోని సంపన్నుల ఆలోచనలు, ఎన్​ఆర్​ఐల ఆలోచనలు వేరు వేరుగా ఉంటున్నాయి. ఎన్​ఆర్​ఐలు ఎక్కువగా సిటిజెన్​షిప్​ బై ఇన్వెస్ట్​మెంట్​ ప్రోగ్రామ్స్​ను ఇష్టపడుతున్నారు. మరోవైపు ఫారిన్​లో వ్యాపారాలున్న  ఇక్కడి మిలియనీర్లు మాత్రం యూరప్​దేశాలలో రెసిడెన్సీ బై ఇన్వెస్ట్​మెంట్​ ఆప్షన్​ను ఎంపిక చేసుకుంటున్నారు. పోర్చుగల్​ గోల్డెన్​ రెసిడెన్స్​ పెర్మిట్​ ప్రోగ్రామ్​ కింద కనీసం 3.5 లక్షల యూరోలను ఆ దేశంలోని రియల్​ ఎస్టేట్​లో పెట్టాల్సి ఉంటుంది. యూరప్​లో ఇదే పాపులర్​ ప్రోగ్రామ్. ఎన్​ఆర్​ఐలైతే యూరోపియన్​ సిటిజెన్​షిప్​ ప్రోగ్రామ్స్​ వైపు ఆకర్షితులవుతున్నారు. ఒక దేశంలో ఉంటూ చాలా దేశాలకు ఈజీగా వెళ్లే అవకాశాలవైపు సంపన్నులు మొగ్గుచూపుతారు. ఆస్ట్రియా పాస్​పోర్టు ఉంటే 187 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చని హందా తెలిపారు.  యూరప్​లోని ఏ దేశంలోనైనా సెటిల్​ అయ్యే అవకాశాన్ని మాల్టా, ఆస్ట్రియా సిటిజెన్​షిప్​ ప్రోగ్రామ్స్​ కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఇంటర్నేషనల్​ ఫైనాన్స్​ సెంటర్లయిన దుబాయ్​, హాంకాంగ్​, సింగపూర్​లలో ఎక్కువగా ప్రొఫెషనల్​ ఎన్​ఆర్​ఐలు ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మార్కెట్ అనుకూలం

రూ. 431 కోట్లు కట్టండి : బార్క్​కు టైమ్స్ గ్రూప్ లీగల్ నోటీసు

టెస్లా రాకతో రూపురేఖలు మారిపోనున్న.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌‌