Lifestyle: నుదుట కుంకుమ.. ఆధ్యాత్మికమే కాదు.. సైన్స్​ పరంగా కూడా ఎన్నో లాభాలు..

Lifestyle: నుదుట కుంకుమ.. ఆధ్యాత్మికమే కాదు.. సైన్స్​ పరంగా కూడా ఎన్నో లాభాలు..

హిందువుల సంప్రదాయంలో ఇది ముఖ్యమైన ఆచారంగా చెప్తారు. ఖచ్చితంగా ఆడవారి నుదుటన బొట్టు ఉండాల్సిందే. బొట్టు అనేది కేలం ఆధ్యాత్మికంగానే కాకుండా..సైన్స్ పరంగా కూడా చాలా లాభాలు ఉన్నాయి. అయితే ఇలా ఎందుకు పెడతారు? వీటి వెనుక ఉన్నా కారణాలు ఏంటి? ఇలా పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ సంప్రదాయంలో ఆడవారికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు, ప్రాముఖ్యతలు ఉన్నాయి. మహిళల కట్టు.. బొట్టుకు మరింత ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా పెళ్లైన ప్రతీ మహిళ నుదుట బొట్టు అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. పూర్వం అయితే కుంకుమను పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు వీటి ప్లేస్‌లో ఎన్న రకరకాల స్టైల్స్‌లో ఉండే స్టిక్కర్స్ వచ్చాయి. 

మనస్సును శాంత పరుస్తుంది

నుదుటన కుంకుమ పెట్టుకోవడం వల్ల ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఆధ్యాత్మిక అవగాహనను పెంచడానికి, మనస్సును శాంత పరచడానికి సహాయ పడుతుందని విశ్వసిస్తారు.

ఆశీర్వాదం కోసం..

దేవతల ఆశీర్వాదం పొందడానికి, ప్రతి కూల శక్తుల ప్రభావం వ్యక్తులపై పడకుండా ఉండేందుకు నుదుటను కుంకుమను ధరిస్తారు. కుంకుమ ధరించడం వల్ల శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. అలాగే దేవళ్లు ఆశీర్వాదం కోసం కూడా కుంకుమను ధరిస్తారు.

మెదడు పనితీరు...

కుంకుమలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయట.. కాబట్టి దీన్ని నుదుటన పెట్టుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని అంటారు.

ఒత్తిడి తగ్గుతుంది.....

కుంకుమ పెట్టుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గేందుకు సహాయ పడతాయని నమ్ముతారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. ఒత్తిడిని తగ్గించేందుకు సహాయ పడతాయి.

చర్మ ఆరోగ్యం మెరుగు పరచడానికి..

కుంకుమ పెట్టుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగ ాఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. అంతే కాకుండా మొటిమలు, మచ్చలు రాకుండా సహాయ పడుతుంది. అయితే ఈ మధ్య కుంకుమలో కూడా పలు రకాల రసాయనాలు కలుపుతున్నారు. దీని వల్ల అలెర్జీ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. 

యోగా ప్రకారం, మహిళలు తమ బొట్టు ధరించే.. స్థలాన్ని అజ్ఞా చక్రం అంటారు, ఇది మానవ శరీరంలో ఆరవ, అత్యంత శక్తివంతమైన చక్రంగా భావిస్తారు. బొట్టు పెట్టుకునేప్పుడు ఈ పాయింట్‌ను రోజుకు చాలా సార్లు ఒత్తుతాం. మానవ శరీరంలో వేల సంఖ్యలో నాడులుంటాయి. వీటన్నింటికీ కేంద్ర స్థానం అజ్ఞా చక్రం.. అంటే కనుబొమ్మల మధ్య స్థానం. ఈ స్థానంలోంచి ప్రాణశక్తి కిరణాలు ప్రసారం అవుతాయి. ఈ స్థానంలో కళ్లు, మెదడు, పిట్యూటరీ గ్రంధికి సంబంధించిన నాడులు ఉంటాయి.

మహిళలు బొట్టు పెట్టుకునేప్పుడు ఆజ్ఞాచక్రంపై ఒత్తుతూ ఉంటారు. స్టిక్కర్‌ ధరించేప్పుడు కూడా దాన్ని సర్దడం, సరిగ్గా పెట్టుకోవడం, తీయడం లాంటివి చేస్తుంటాం. దీని వల్ల ఆజ్ఞాచక్రం వద్ద ఒత్తిడి పడుతుంది. దీంతో నాడులు ఉత్తేజం అవుతాయి. పురుషులు బొట్టు పెట్టుకోలేరు కాబట్టి.. ఆ స్థానంలో కుంకుమ పెట్టుకున్నా, 100 సార్లు ఆ పాయింట్‌ను ప్రెస్‌ చేసినా అనేక ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇంకా ఏమేమి ఉపయోగాలున్నాయంటే...

  • తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • సైనస్‌లను క్లియర్ చేస్తుంది.
  • దృష్టిని, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
  • డిప్రెషన్‌ను నివారిస్తుంది.
  • వినికిడి శక్తిని మెరుగుపరుస్తుంది.
  • జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుంది.
  • అంతర్ దృష్టి, అవగాహనను మెరుగుపరుస్తుంది.
  • ఒత్తిడితో కూడిన మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది.