ఎండలు, వడగాలులపై వాతావరణ శాఖ అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈఏడాది మార్చిలోనే రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదయ్యాయి. ప్రతి ఏడాది ఏప్రిల్, మేలో వచ్చే వడగాలులు ఈసారి మార్చిలోనే కనిపించాయి. ఇప్పటికే ఎండలు, ఊక్కపోత, వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక నుంచి ఎండలు మరింత తీవ్రమవుతాయని తాజాగా వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఏప్రిల్ రెండో వారంలో ఎండల తీవ్రత పెరగడంతో పాటు వడగాలులు వస్తాయని అలర్ట్ జారీ చేసింది. 

ఎక్కువగా బయటకు రావొద్దు

ఎండలో బయటకు వెళ్లేప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు క్రాస్ అయితే.. ఎక్కువ సమయం బయట తిరగొద్దని, ఎండల్లో బయటనే ఉంటే డీహైడ్రేషన్ జరిగి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పెద్ద వయసు వారిలో దీని వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు.

మరిన్ని వార్తల కోసం..

పోలీసులపై మరో ఎంఐఎం కార్పొరేటర్ దౌర్జన్యం

‘వీరమల్లు’ కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్

ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ కేర్ స్కీమ్‌ ఆయుష్మాన్ భారత్