హైదరాబాదీలూ.. అత్యవసరమైతేనే బయటకు రండి: వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాదీలూ.. అత్యవసరమైతేనే బయటకు రండి: వాతావరణ శాఖ హెచ్చరిక

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎కు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో హైదరాబాద్‎లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో నగరవాసులు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. రాష్ట్రంలోని మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..19 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నండి 50 కి. మీ వేగంతో కూడిన బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. లోతట్టు ప్రాంతాలను ప్రజలను అప్రమత్తం చేయాలని సంబంధిత శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. వర్షం వల్ల ఇమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని సూచించింది. వర్షం పడే సమయంలో ఇంట్లోనే ఉండాలని.. తప్పదనుకుంటునే బయటకు వెళ్లాలని పేర్కొంది. 

Also Read :- హైదరాబాద్ లో నాన్ స్టాప్ వర్షం.. ఎప్పుడు తగ్గుతుందో ఏమో..

కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుండి రాష్ట్రవ్యాప్తంగా నాన్ స్టాప్‎గా వర్షం పడుతోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, ఖైరతాబాద్, లక్డీ కపూల్, నాంపల్లి, దిల్‎సుఖ్ నగర్, నల్లకుంట, విద్యానగర్, హబ్సిగూడ, తార్నక, ఉప్పల్ తదిరత ప్రాంతాల్లో వాన పడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమైంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.