తెలంగాణకు తప్పిన గండం : మరో 5 రోజులు మోస్తరు వర్షాలు మాత్రమే

తెలంగాణకు తప్పిన గండం : మరో 5 రోజులు మోస్తరు వర్షాలు మాత్రమే

తెలంగాణ రాష్ట్రానికి కొద్దిలో కొద్దిగా గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలోని వాయుగుండం పూర్తిగా బలహీనపడుతుందని.. మరో 12 గంటల్లో అల్పపీడనంగా మారనుందని వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ ప్రభావంతో.. తెలంగాణ రాష్ట్రంలో భారీ, అతి భారీ వర్షాలు పడవని వివరించింది. కాకపోతే రాబోయే ఐదు రోజులు అంటే.. సెప్టెంబర్ 6వ తేదీ వరకు మోస్తరు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. 

తూర్పు విదర్భను ఆనుకుని.. తెలంగాణ మీదుగా బలహీనపడిన వాయుగుండం కేంద్రీకృతం అయ్యి ఉందని.. ఇది సెప్టెంబర్ 2వ తేదీ నాటికి రామగుండంకు ఈశాన్యదిశగా 130 కిలోమీటర్ల దూరంలో ఉందని వివరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ ప్రభావంతో సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. 

Also Read:-ప్రభుత్వం కీలక నిర్ణయం.. వరద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంపు

ఈ ప్రభావంతో రాబోయే 24 గంటలు అంటే.. సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. 

హైదరాబాద్ సిటీ, శివార్లలో మాత్రం మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది వాతావరణ కేంద్రం. మరో ఐదు రోజులు అంటే.. సెప్టెంబర్ 6వ తేదీ వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని.. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వెదర్ డిపార్ట్ మెంట్.