ప్రపంచవ్యాప్తంగా గత యాభై ఏండ్లలో వెదర్ డిజాస్టర్స్ ఐదు రెట్లు పెరిగాయని యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది. ఈ మధ్యకాలంలో వచ్చిన తుఫాన్‌లు, వరదలు, కార్చిచ్చుల కారణంగా సగటున రోజూ 115 మంది మరణిస్తున్నారని వెల్లడించింది. ప్రమాదాలను ముందుగా గ్రహించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో గతం కంటే ఎక్కువగా వారి ప్రాణాలను రక్షించగలుగుతున్నారు. దీని వల్ల మరణాల రేటు కాస్త తగ్గినా ఆర్థికంగా జరిగే నష్టాన్ని మాత్రం ఆపలేకపోతున్నారని యూఎన్ రిపోర్ట్ పేర్కొంది.
ఫారెస్ట్ ఫైర్స్.. హరికేన్స్.. ఫ్లడ్స్
1970ల తర్వాత ఏడు మోస్ట్ వెదర్ డిజాస్టర్స్ వల్ల ఎంతో డ్యామేజ్ జరిగింది. ఐడా హరికేన్ లాంటివి ఈ యాభై ఏండ్లలో నాలుగు నుంచి ఐదు హరికేన్‌లు వచ్చాయట. ఇంకా వరదలు, కరువు వంటి వాటి వల్ల 1970 నుంచి 1980 వరకు సగటున 170 మంది చనిపోగా, 2010లో ఈ సంఖ్య 40కి పడిపోయింది. డబ్ల్యుఎమ్‌ఓ నివేదిక ప్రకారం 1970 – 2019 మధ్య 11,000 కంటే ఎక్కువ వెదర్ డిజాస్టర్స్ వచ్చాయి. వీటి కారణంగా ఈ యాభై ఏండ్లలో రోజూ 115 మంది చొప్పున చనిపోగా, 202 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. మొత్తంగా 2 మిలియన్లకు పైగా మరణాలు, 3.64 ట్రిలియన్ డాలర్ల నష్టాలు జరిగాయని నివేదిక తెలిపింది. 1970లో 5,56,000 మరణాలు ఉండగా, 1990లో 3,29,000 మరణాలు సంభవించాయి. 2000లో కూడా 3,29,000 మంది చనిపోగా, 2010 నాటికి ఆ సంఖ్య 1,85,000కి పడిపోయింది. ప్రస్తుతం యూఎస్ ఎదుర్కొంటున్న ఐడా హరికేన్ వల్ల భారీగా నష్టం జరుగుతోంది. ఈ వేసవిలో యూరప్ ప్రధాన భూభాగంలో సంభవించిన ఫ్లడ్స్, ఫారెస్ట్ ఫైర్ వల్ల కూడా చాలానే నష్టం జరిగింది. అడవుల్లో ఏర్పడ్డ మంటల వల్ల వాతావరణంలో వేడి గాలులు పెరిగి సముద్రాలు కూడా వేడెక్కిపోతున్నాయి. దీనివల్ల నీరు ఎక్కువ శాతం ఆవిరిగా మారి అధిక వర్షపాతం, వరదలు సంభవిస్తాయి.
ఆర్థిక నష్టం
1970 నుంచి 2019 వరకు సంభవించిన 50 శాతం విపత్తుల్లో మరణాలు 45 శాతమైతే ఆర్థిక నష్టం 74 శాతం జరిగింది. ఈ మరణాల్లో 91 శాతానికి పైగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనివే. గడిచిన ఈ యాభై ఏండ్లలో వెదర్ డిజాస్టర్స్ వల్ల రెండు మిలియన్లకు పైగా మరణాల్లో 90%, ఎకనమిక్ డ్యామేజ్ 60% అభివృద్ధి చెందిన దేశాల్లోనే జరిగిందని యూఎన్ పేర్కొంది. అన్నిటికంటే 2010లో 1.38 ట్రిలియన్ డాలర్ల నష్టం జరిగిందని, ఇది 1970లో జరిగిన 175.4 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువని తెలిపింది. ఇంకా 2017లో వచ్చిన పది హరికేన్లలో హార్వే, మారియా, ఇర్మా తుఫాన్ల వల్ల కూడా ఎంతో నష్టం జరిగిందని, 1970 నుంచి 2019 వరకూ ప్రపంచ వ్యాప్తంగా జరిగిన టాప్ పది విపత్తుల్లో ఈ మూడు తుఫానుల వల్ల కలిగిన నష్టం 35% ఉందని చెప్పింది.