హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావారణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటికప్పుడే ఆకాశం లో మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో హైదరాబాద్ సిటీలో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సరూర్ నగర్,కొత్త పేట ,మలక్ పేట పరిసర ప్రాంతాల్లో చిరుజల్లు పడుతున్నాయి. అనుకోకుండా పడుతున్న వర్షంలో సద్దుల బతుకమ్మ సంబురాలకు కొంచెం ఆటంకం ఏర్పడింది. మరోవైపు బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, మాసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.