
హైదరాబాద్ సిటీలో భారీ వర్షం.. కుండపోతగా వాన పడుతుంది. వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చిట్లుగానే.. హైదరాబాద్ సిటీలో 2025, ఏప్రిల్ 3వ తేదీ ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అయ్యి.. కుండపోతగా వర్షం పడింది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, కూకట్ పల్లి, గచ్చిబౌలి ఏరియాల్లో భారీ వర్షం పడింది. రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపై వాహనాలు నిదానంగా సాగుతున్నాయి.మరో నాలుగు రోజులపాటు ( ఏప్రిల్ 3 వతేదీ నుంచి) వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన తెలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు.. వీచే అవకాశం ఉందని వివరించింది.
హైదరాబాద్ సిటీ మొత్తం భారీ వర్షం పడుతుండటంతో.. రోడ్లపై వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోయారు. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షం పడుతుండటంతో రోడ్లు అన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ జాం అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి