బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అదే ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరత్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అంతర్గతంగా కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులపాటు ( ఫిబ్రవరి 26 వరకు) తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మూడు రోజుల పాటు ( ఫిబ్రవరి 24 నుంచి) ఉష్ణోగ్రతలు తగ్గి ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షంకురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ లో రాత్రి సమయాల్లో తేలికపాటి వర్షం పడుతుంది. ఈ 27 నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశా వెల్లడించింది.