- సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి:వాతావరణ శాఖ
హైదరాబాద్: ద్రోణి ప్రభావం రాష్టం మీద ఉంది.. ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు మరో రెండు రోజులపాటు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. మరో రెండు రోజులు ద్రోణి ప్రభావం కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అలాగే ఎండల తీవ్రత తగ్గిపోయి..సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మధ్యాహ్నం నుండి ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయని తెలిపింది.
ద్రోణి ప్రభావంతో నిన్నటి నుంచి ఇవాళ ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.
హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో తేలికపాటి వర్షాలు, తేలికపాటి జల్లులు కురిశాయి. కుబ్దుల్లా పూర్ లో 3.6 సెంటిమీటరేజ్ మోస్తరు వర్షం నమోదయింది.