
రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్ మెంట్. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 4 రోజులు సిటీతో పాటు జిల్లాల్లో వానలు పడతాయన్నారు. కొన్నిజిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు చెప్పారు. రేపటి లోపు పశ్చిమజిల్లాల్లో ప్రవేశించే అవకాశముందని తెలిపారు. నిన్న నారాయణపేట జిల్లాలో మాన్ సూన్ ప్రభావంతో వర్షాలు కురిశాయన్నారు.
రుతుపవనాలు ఏపీ ఉత్తరంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు. అక్కడక్కడ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు.
రేపు కొన్నిజిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు వెదర్ ఆఫీసర్లు. ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలకు అలర్ట్ జారీచేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు.
గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు.