
ఐపీఎల్ కు ప్రారంభ మ్యాచ్ కు ముందు అభిమానులకు ఒకటే టెన్షన్. వర్షం కారణంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన తొలి మ్యాచ్ రద్దవుతుందేమోనని భయపడ్డారు. నేడు (మార్చి 22) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతున్న ఈ మ్యాచ్ కు ప్రస్తుతం ఎలాంటి వర్షం లేదు. రెండు మూడు గంటలుగా ఇక్కడ వర్షం పడలేదు. మబ్బులు కూడా లేకపోగా.. పిచ్ పై కప్పి ఉంచిన కవర్స్ కూడా తీసేసారు. దీంతో ఓపెనింగ్ సెర్మనీతో పాటు మ్యాచ్ జరగడం ఖాయంగా కనిపిస్తుంది. సీజన్ లో ఇదే తొలి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ రద్దు వర్షం కారణంగా రద్దు కాకూడదని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు.
ఈడెన్ గార్డెన్స్ దగ్గర శనివారం ఉదయం కూడా నల్లటి మేఘాలు దట్టంగా కమ్ముకుని, చిరు జల్లులు కురవడంతో ఐపీఎల్ అభిమానులు మ్యాచ్ జరుగుతుందో, లేదో అని టెన్షన్ పడ్డారు. అంతకముందు రెండు రోజులు కోల్ కతా లో భారీ వర్షాలు కురవడంతో ఈ మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ.. శనివారం (మార్చి 22) మధ్యాహ్నం 12 తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. వాన కళ పోయి ఎండ రావడంతో కేకేఆర్, ఆర్సీబీ ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు. ఇప్పటికీ ఎలాంటి వర్ష సూచనలు లేకపోవడంతో మ్యాచ్ కు వరుణుడు గండం లేనట్టు తెలుస్తుంది.
Weather Update Time-05:00PM
— KL17 (@karanlal17_) March 22, 2025
No rain - covers are now removed and we are all set for the match. 🤩
Kolkata Visuals #KKRvsRCB #KolkataWeather #IPL2025 #ipltickets #Cricket #WeatherUpdate pic.twitter.com/bQeUYSHVR9
ప్రతి సీజన్ కు మాదిరి మ్యాచ్ కు ముందు గ్రాండ్ గా ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ ఓపెనింగ్ సెర్మనీ వేడుకలకు సిద్ధమైంది. షారూఖ్ తో ఇండియా టాప్ సింగర్లు శ్రేయా ఘోషల్, కరణ్ ఔజ్లా తమ పాటలతో ఫ్యాన్స్ ను ఉర్రుతలూగించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ తన డ్యాన్స్ తో అభిమానులకి కిక్ ఇవ్వనుంది. సాయంత్రం 6 గంటల నుంచి వేడులకు ప్రారంభమవుతాయి. 7 గంటలకు టాస్.. 7:30 నిమిషాలకు మ్యాచ్ జరుగుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్,జియో హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు. సొంత గడ్డ కావడంతో ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫేవరేట్స్ గా బరిలోకి దిగుతుంది.