ఎండలు మండుతున్నాయ్.. అవసరం అయితేనే బయటకు రండి : వాతావరణ శాఖ వార్నింగ్

ఎండలు మండుతున్నాయ్.. అవసరం అయితేనే బయటకు రండి : వాతావరణ శాఖ  వార్నింగ్

బాబోయ్​ ఎండలు ఠారెత్తిత్తుస్తున్నాయి.   సూర్యుడు సుర్రు మంటూ మండుతున్నాడు.  మార్చి నెలలో నే ఎండలకు జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.  అవవసమైతేనే తప్ప జనాలను బయటకు రావద్దని వాతవరణశాఖ అధికారులు వార్నింగ్​ ఇస్తున్నారు. 

భానుడి తాపానికి జనాలు చిటచిటలాడుతున్నారు.  ఎండ వేడికి తట్టుకోలేక జనాలు అల్లాడిపోతున్నారు. మార్చి నెలలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతుంది. ఏజన్సీ ఏరియాల్లో.. కోస్తా జిల్లాల్లో గతేడాదితో (2024) పోలిస్తే ఈ ఏడాది మరింతగా ఎండలు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది.  

Also Read : హైదరాబాద్ పబ్లిక్కు అలర్ట్.. మార్చి 18 వరకూ జర జాగ్రత్త..!

సాధారణంగా మార్చి నెలలో 35 డిగ్రీల వరకు ఉష్టోగ్రత నమోదవుతుంది.   కాని  ఈ ఏడాది 40 డిగ్రీలు దాటడంతో చిన్న పిల్లలు.. వృద్దులు ఉక్కపోతకు ఇబ్బంది పడుతున్నారు.  మార్చిలోనే ఇలా ఉంటే వచ్చే రోజుల్లో పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.  

 జనాలు అ సమ్మర్ హీట్ ను బీట్ చేసేందుకు చల్ల చల్లని,కూల్ కూల్ గా వుండే ఫ్రూట్స్ , సమ్మర్ డ్రింక్స్ ను తీసుకుని ఎండ ప్రతాపాన్నికూల్ చేస్తున్నారు. మరో వైపు .. వేడి తీవ్రత అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్, తలనొప్పి, నీరసం, గుండెపోటు ప్రమాదాలు పెరుగుతాయి అంటున్నారు వైద్య నిపుణులు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.