తెలంగాణ అంతా నైరుతి.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

తెలంగాణ  అంతా నైరుతి.. బంగాళాఖాతంలో  ఉపరితల ఆవర్తనం

నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈనెల 3న రాష్ట్రంలోని ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. . ప్రస్తుతం తెలంగాణ లోని నారాయణపేట, ఆంద్రప్రదేశ్‌లోని నర్సాపూర్‌ గుండా రుతుపవనాలు కదులుతున్నట్లు చెప్పింది. 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని, కదలికలు ఇదే తరహాలో ఉంటే వారం రోజుల్లో రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తాయని అంచనా వేస్తోంది.  దీని కారణంగా పలుజిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. మెదక్​, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మీదుగా రుతుపవనాలు వ్యాపిస్తున్నాయి. కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్​ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్​ జారీ చేసింది,  తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు ( జూన్​ 7 నుంచి) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  దక్షిణ తెలంగాణాలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. హైదరాబాద్​లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది.

రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగటి పూట కొంతసేపు గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నప్ప టికీ.. ఆశాశం మేఘావృతం కావడంతో క్రమంగా ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గుతూ వస్తోంది. సాయంత్రానికి పూర్తిగా చల్లని వాతావరణం ఏర్పడుతోంది. రెండు రోజులు  ( జూన్​ 5,6) రాష్ట్రంలో ఉష్ణో గ్రతలు సాధారణం, అంతకంటే తక్కువగా నమోదు కావొచ్చని ఆ శాఖ అంచనా వేసింది. 

నిజామాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత: దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం  నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది. 

దీని ప్రభావంతో తెలంగాణలోని తూర్పు, ఉత్తర ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని పేర్కొంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలను పరిశీలిస్తే నిజామాబాద్‌లో 40.1 డిగ్రీ సెల్సీయస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 22.5 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది.