భారీ వర్షాలు: పలు రాష్ట్రాలకు IMD హెచ్చరికలు

భారీ వర్షాలు: పలు రాష్ట్రాలకు IMD హెచ్చరికలు

రాబోయే 24 గంటలు దేశంలోని పలు రాష్ట్రాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, ఢిల్లీతో సహా ఈశాన్య రాష్ట్రాలను హెచ్చరించింది. వర్షాభావ పరిస్థితలను బట్టి ఆయా రాష్ట్రాలకు రెడ్, ఆరంజ్, ఎల్లో అలెర్ట్ లు జారీ చేసింది. 

రెడ్ అలర్ట్‌ ఉన్న ప్రాంతాలు

  • గుజరాత్
  • మధ్య మహారాష్ట్ర
  • గోవా, కొంకణ్
  • పశ్చిమ మధ్యప్రదేశ్
  • తూర్పు రాజస్థాన్
  • నాగాలాండ్
  • మణిపూర్
  • మిజోరం
  • త్రిపుర

ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడిన ప్రాంతాలు

  • ఒడిశా
  • గంగానది పశ్చిమ బెంగాల్
  • తీర కర్ణాటక
  • పశ్చిమ రాజస్థాన్

ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

రానున్న 24 గంటలపాటు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

  • ఉత్తర ప్రదేశ్
  • తూర్పు మధ్యప్రదేశ్
  • ఛత్తీస్‌గఢ్ 
  • అస్సాం
  • కేరళ
  • కర్ణాటకలోని పలు ప్రాంతాలు

ఢిల్లీ వాసులూ అప్రమత్తంగా ఉండండి

వాతావరణ శాఖ ప్రకారం.. నరేలా, బవానా, అలీపూర్, బురారీ, కంఝవాలా, రోహిణి, బాదిలి, జఫర్‌పూర్, నజఫ్‌గఢ్‌తో సహా ఢిల్లీలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్‌తో సహా ఎన్‌సిఆర్‌లోని అనేక ప్రాంతాల్లో రాబోయే 24 గంటలు తేలికపాటి నుండి భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.