రెయిన్ అలర్ట్.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

రెయిన్ అలర్ట్.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

తెలంగాణకు  రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ  అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రం మీదుగా నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని తెలిపింది. 

 గాలులు ప్రధానంగా పశ్చిమ మరియు నైరుతి దిశల నుండి వీస్తున్నందున ఈ రోజు పలు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..జులై 4న 5న  కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో స్థిరమైన ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. 

హైద్రాబాద్ లో  సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రానున్న  మూడు రోజుల పాటు  సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 34°C మరియు 23°C గా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ/దక్షిణ-పశ్చిమ దిశలలో గాలులు వీచే అవకాశం ఉంది, గంటకు 08---12 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గ్రేటర్ లో రానున్న  48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది.  రాత్రి సమయాల్లో తేలికపాటి  నుంచి ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.