నాలుగేళ్లలో 8కోట్ల ఉద్యోగాలు.. మోదీ చెప్పినవన్నీ అబద్ధాలే: మల్లికార్జున్ ఖర్గే

నాలుగేళ్లలో 8కోట్ల ఉద్యోగాలు.. మోదీ చెప్పినవన్నీ అబద్ధాలే: మల్లికార్జున్ ఖర్గే

న్యూఢిల్లీ: నాలుగేళ్లలో 8 కోట్లు ఉద్యోగాలు ఇచ్చామని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. వాస్తవాలను కప్పి పుచ్చేందుకు ప్రధాని మోదీ..ఉద్యోగాలపై  తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రధాని మోదీ అబద్ధాల వల నేస్తున్నారని అన్నారు. 

శనివారం (జూలై13) ముంబైలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.ముంబైలో 29వేల కోట్లతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ప్రారంభించిన మోదీ.. ఎన్డీయే ప్రభుత్వం గత నాలుగేళ్లలో 8కోట్లు ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. 

నిరుద్యోగంపై గొంతెత్తిన ప్రతిపక్షాలపై మోదీ ఎదురు దాడి చేశారని.. 2023-24లో కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మొత్తం 4.7 కోట్ల ఉద్యోగాలను  ఇచ్చిందని  రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా కు తప్పుడు నివేదిక ఇచ్చారని ఆయన మండిపడ్డారు.