హోమ్ టౌన్ వెబ్ సిరీస్: ఒక నోస్టాల్జిక్ అన్వేషణ

 హోమ్ టౌన్ వెబ్ సిరీస్: ఒక నోస్టాల్జిక్ అన్వేషణ

ఇంటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంలో వస్తున్న వెబ్ సిరీస్ ‘హోం టౌన్’. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి ప్రధానపాత్రలు పోషించారు. శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకుడు.  నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. శుక్రవారం నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌మీట్‌‌లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ ‘ఈ సిరీస్‌‌ చూసిన వారిలో కొందరికి తమ సొంత ఊరు, మరికొందరికి తమ గత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి.

ఇందులోని  పిల్లల అల్లరి చూస్తుంటే 35 ఏళ్లు వెనక్కి వెళ్లిన ఫీలింగ్ కలిగింది’ అన్నారు.  ‘విదేశాలకు వెళ్లినా మన సొంతూరుతో ముడిపడిన జ్ఞాపకాలను మర్చిపోలేం. అలాంటి ఎమోషన్స్ అన్నీ ఇందులో మిమ్మల్ని ఆకట్టుకుంటాయి’ అని దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి చెప్పాడు.  నిర్మాత నవీన్ మేడారం మాట్లాడుతూ ‘‘90స్‌‌ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న వెబ్ సిరీస్ ఇది.  దీనికి కూడా అదే స్థాయిలో పేరు వస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.  మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలితో పాటు నటీనటులు ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనిరుధ్, అనీ, శ్రావ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.